ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ట్రైలర్ భారీ అంచనాల మధ్య ఆదివారం విడుదలైంది. ట్రైలర్ విడుదల తర్వాత ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తూ, పుష్ప 2 కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. నవంబర్ 17న బిహార్ లోని పాట్నాలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంటుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు, దీంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప 2 ట్రైలర్ తెలుగు, హిందీ భాషల్లో విడుదలై రికార్డుల్ని సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అవగానే, కేవలం 15 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో పుష్ప 2 ట్రైలర్, మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ (38 మిలియన్) మరియు ప్రభాస్ సలార్ ట్రైలర్ (39 మిలియన్) రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటివరకు, గుంటూరు కారం ట్రైలర్ 38 మిలియన్ వ్యూస్ సాధించిన రికార్డు ఉండేది. కానీ, పుష్ప 2 ట్రైలర్ 15 గంటల్లోనే ఈ సంఖ్యను దాటేసింది.
80 మిలియన్ వ్యూస్ చేరుకున్న ట్రైలర్!
24 గంటల్లో ఈ ట్రైలర్ మరిన్ని రికార్డులను సృష్టించడంతో పాటు, తెలుగు, హిందీ వెర్షన్లలో కలిపి 80 మిలియన్ వ్యూస్ దాటినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ట్రైలర్ కు 150 మిలియన్ వ్యూస్‌ను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రికార్డులతో పుష్ప 2 ట్రైలర్ చరిత్ర సృష్టించేలా ఉంది.
పుష్ప 2: ఫ్యాన్స్‌కి భారీ బంపర్ గిఫ్ట్
పుష్ప 2 సినిమా కోసం పాన్-ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ మరియు రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలకానుంది. పుష్ప 2 ప్రమోషన్స్ వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే కిస్సిక్ అనే ప్రత్యేక గీతం కూడా విడుదల కానుంది, ఇందులో శ్రీలీలా అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది.