టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి కొత్త వెబ్ సిరీస్ ‘ద రానా దగ్గుబాటి షో’ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ 23వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్పిరిట్ మీడియా బ్యానర్ పై నిర్మించబడిన ఈ వెబ్ సిరీస్, సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలుని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఉంది. రానా దగ్గుబాటి ఈ షోని హోస్ట్ చేస్తూ, ఆన్-స్క్రీన్‌తో పాటు ఆఫ్-స్క్రీన్‌లో కూడా ఎక్స్‌యిటింగ్ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందించబడింది. ఇందులో దుల్కర్ సల్మాన్, నాగచైతన్య అక్కినేని, సిద్దూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్‌ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. వారు అన్‌ఫిల్టర్డ్ సంభాషణలలో పాల్గొని, పలు ఎక్సయిటింగ్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు.

‘ద రానా దగ్గుబాటి షో’ అనే ఈ సిరీస్ సెలబ్రిటీల వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక కోణాన్ని చూపిస్తుందని, ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ తెలిపారు