టాలీవుడ్ సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. తన కుమారుడు నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం, పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

గ్లామరస్ వెడ్డింగ్ ప్రిపరేషన్స్!

గ్రాండ్ వెడ్డింగ్ కోసం వేదిక ఏర్పాట్ల బాధ్యత ఒక ప్రముఖ ఆర్డ్ డైరెక్టర్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ వివాహం సంబరాలకు సినీ, రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరవుతారని తెలుస్తోంది.

కట్నం, కానుకలపై ఆసక్తికర వార్తలు!

అయితే, నెట్‌లో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. శోభిత ధూళిపాళ్ల తల్లిదండ్రులు నాగచైతన్యకి భారీ కానుకలు ఇవ్వాలని భావిస్తున్నారట. రేసింగ్ కార్లపై అభిమానం ఉన్న నాగచైతన్యకి ఓ ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా, హైదరాబాద్‌లోని ఒక లగ్జరీ విల్లా కూడా ఆయన్ను కట్నంగా ఇవ్వనున్నారని టాక్. మరోవైపు, అక్కినేని కుటుంబం తమకు ఎలాంటి డబ్బు లేదా నగలు అవసరం లేదని చెప్పింది. నాగచైతన్యకి ఊరేగా ఒక మంచి భార్య, జీవితాంతం అతని తోడునీడుగా ఉండాలని వారు అనుకుంటున్నారట. దీంతో, శోభిత కూడా కేవలం బంగారం మాత్రమే కట్నంగా తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.