గ్లామర్ క్వీన్ అయిన కొంత లక్ ఉండాలి గురూ ..ఇది అక్షరాల సత్యం .. కన్నడ లో సూపర్ హిట్ అయిన సప్తసాగరాలు దాటి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గ్లామర్ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.తాజగా ఈ అందాల ముద్దుగుమ్మ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి.. ఇక ఈ ముద్దుగుమ్మకు కాంపిటేషన్ లో ముందుండాలి అంటే ఒక హిట్ అర్జెంట్ గా కావలి..

సప్తసాగరాలు దాటి అనే కన్నడ సినిమాతో పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్.ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది..ఇక ఈ సినిమాతరువాత రుక్మిణికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి . చక్కని ముఖ కవళికలు, తనదైన శైలి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది రుక్మిణి వసంత్. సప్తసాగరాలు దాటి సినిమా తరువాత రుక్మిణి కన్నడలో బఘీర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది , అలానే తెలుగులో యంగ్ హీరో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాలో కూడా ప్రేక్షకులను పలకరించింది ,ఇక ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ఆశించినత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. సినిమాల రిజల్ట్ అటు ఇటు అయిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం కొదవ లేదు. ఇక సోషల్ మీడియా లో ఈ రుక్మిణి వసంత్ గురించి ఓ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది .ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో తారక్ సరసన రుక్మిణి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందనే న్యూస్ బయటకు వచ్చింది , ఇక ఈ న్యూస్ లో క్లారిటీ రావాలంటే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావలసిందే ..