ప్రస్తుతం తారక వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఫుల్ దూకుడు మీద ఉన్నాడు . తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ప్రశాంత్ నీల్ , తరువాత మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నెల్సన్ , అలానే వెట్రిమారన్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు,ఇక ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది . నెల్సన్ ఈ స్టోరీ లైన్ ను తారక్ కు వినిపించగా తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.జైలర్ 2 సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు అని టాక్ .అలానే వెట్రిమారన్ తో కూడా తారక్ సినిమా చెయ్యాలని ఉంది. మరి వెట్రిమారన్ తారక్ తో సినిమా ఎప్పుడు మొదలుపెడతాడు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది ..
వార్ 2 సినిమా పూర్తి కాగానే ,తారక్ ప్రశాంత్ నీల్ సినిమాకు స్విఫ్ట్ అవుతాడు ..అలానే ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి కాగానే దేవర 2 సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది అని మరో టాక్ వినిపిస్తుంది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్… రీసెంట్ గా దేవర మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ మూవీతో సోలో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తారక్… తన క్రేజీ లైనప్ ను సెట్ చేసుకోవడంతో పాటు తన మార్కెట్ ను పెంచుకునే పనిలో ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది