దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .. ప్రస్తుతం తారక్ బాలీవుడ్ మూవీ వార్ 2 లో నటిస్తున్నాడు , అలానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా ఇటీవలే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే వచ్చేసింది .. ఇక దేవర మూవీ ఓటీటీ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది .. బాహుబలి పార్ట్ 1 చివరిలో ఒక చిన్న హింట్ ఇచ్చినట్లు ,దేవర లో కూడా పార్ట్ 2 కి సంబంధించి చిన్న హింట్ ఇచ్చాడు కొరటాల శివ .. తాజగా దేవర పార్ట్ 2 సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో అనేక ప్రశ్నలు వస్తున్నాయి .. ఇక దీనికి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియా లో బయటకు వచ్చింది..
కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ దేవర .. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. ఆచార్య సినిమా డిసాస్టర్ తరువాత కొరటాల శివ కొంత గ్యాప్ తీసుకొని , ఎన్టీఆర్ తో దేవర సినిమా ఎనౌన్స్ మెంట్ చేశారు .. ఇక వీరిద్దరిది హిట్ కాంబినేషన్ , జనతా గ్యారేజ్ లాంటి హిట్ తరువాత ఎన్టీఆర్ తో కొరటాల శివ చేసిన సెకండ్ సినిమా దేవర .. భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నీకల్ వాల్యూస్ తో , ఎన్టీఆర్ టెరిఫిక్ యాక్టింగ్ అనిరుద్ బ్యాక్ గ్రౌండ్
స్కోర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ..
ఎన్టీఆర్ ప్లాన్ సూపర్ .. దేవర 2 విషయంలో తారక్ ప్లానింగ్ మాములుగా లేదు .ఎన్టీఆర్, ప్రజెంట్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల పనుల్లో బిజీ అయ్యారు. ఇకకొరటాల శివ కూడా షార్ట్ గ్యాప్ తరువాత దేవర సీక్వెల్ పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది . దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్. దేవర కథ స్పాన్ పెద్దది కావడంతో ఈ సినిమాను 2 పార్ట్శ్ గా తెరకేకించడానికి అవకాశం ఉంది . ఇక మొదటి పార్ట్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొరటాల శివ
కూడా స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతీ విషయంలోనూ పార్ట్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ, ..ఈ గ్యాప్ లో పార్ట్ 2 వర్క్ స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు .. ముఖ్యంగా తొలి భాగంలో కథ, యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకటంతో ప్రారంభమైంది. కానీ ఆ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది . సీక్వెల్‌లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించనుంది. ఆ రోల్‌లో కనిపించబోయే నటుడి కోసం మేకర్స్ వేట మొదలు పెట్టారు . వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమా , ఈ రెండు పూర్తి అవ్వగానే దేవర 2 స్టార్ట్ అవుతుంది ..ఫైనల్ గా కొరటాల శివ దేవర 2 కోసం బాగానే కష్టపడుతున్నారు , మరి చూడాలి యతి క్యారెక్టర్ లో నటించపోయే ఆ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే ..