కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మద్యం టెండర్లలో సిండికేట్లపై కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర

మద్యం టెండర్లలో సిండికేట్లను పరిగణనలోకి తీసుకోమని, ఎవరైనా సిండికేట్ చేస్తున్నట్టు తేలితే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న ప్రక్షాళన కారణంగా కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు వేయటానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు 20 వేల టెండర్లు వచ్చినట్లు చెప్పారు. జిల్లాకలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా టెండర్లు తెరిచి దుకాణాలు అప్పగించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.