Vijayawada : ఇంద్రకీలాద్రి ఆలయ అధికారుల తీరుపై చరుచూ విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అమ్మవారి ప్రసాదంలో మేకు కనిపించింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
