CBN In Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధతుల పునరావాసాన్ని పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2027లో ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి పునరావాసం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి ముంపు బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
