Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. డీజీపీని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షుల మరణాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.