దేవర  సినిమా  రివ్యూ

   :   కొరటాల  శివ  ఎన్టీఆర్  కాంబినేషన్  లో   తెరెకెక్కిన  హై  వోల్టేజ్  యాక్షన్  సినిమా  దేవర .. 6 ఇయర్స్ గ్యాప్   తరువాత  యంగ్  టైగెర్  ఎన్టీఆర్  సోలో హీరోగా  ప్రేక్షకుల  ముందుకు  వచ్చాడు  .. ఇక   కోస్టల్  బ్యాక్  డ్రాప్ లో  ఈ  సినిమా  ఉంటోందని  కొరటాల  శివ  సినిమా  ఓపెనింగ్  రోజునే  కధను  రీవీల్ చేసాడు  .. ..

జనతా  గ్యారేజ్ లాంటి  సక్సెస్ ఫుల్  బ్లాక్  బస్టర్   తరువాత  వీరిద్దరి  కాంబోలో  వస్తున్న  రెండొవ  సినిమా   కావడడంతో  ఈ  సినిమా  మీద  ప్రేక్షకుల్లో  హై  ఎక్స్పెక్టేషన్స్   ఉన్నాయి  .. .ప్రపంచవ్యాప్తంగా ఈ   సినిమా   ఈ రోజున  అత్యధిక  థియేటర్స్  లో  రిలీజ్ అయింది ..    అసలు దేవర  సినిమా  ప్రేక్షకుల  అంచనాలను  అందుకుందా , కొరటాల  శివ  ఈ  సినిమా  మీద  పెట్టిన  ఎఫర్ట్  స్క్రీన్  మీద  కనబడిందా  అనేది  మన  రివ్యూ లో  చూద్దాం ..

‘ఆచార్య’ ఫెయిల్యూర్‌ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ  సినిమా  విషయంలో   కొరటాల  శివ   కాస్త జాగ్రత్తగా స్ట్రాంగ్   కమ్ బ్యాక్  ఇవ్వాలనే    గట్టి ప్రయత్నం  చేసారు  ..  ఇక  సాంగ్స్  ప్రేక్షకులను   బాగా   అలరించినా ట్రైలర్‌ మాత్రం అభిమానుల్ని  కాస్త  నిరుత్సాహపరిచింది  అని  మరి  కొందరి భావించారు  ..



ఇక  ఈ  సినిమా  కథ  విషయానికి  వస్తే  .. :

ఈ  సారి  కొరటాల  శివ  బిగ్గర్  క్యాన్వాస్  లో  స్టోరీ చెప్పే  ప్రయత్నం చేసారు  .. ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. బ్రిటీష్‌ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురగ దగ్గర పని చేయకూడదని, మరో మార్గంలో పని చేసుకుందామని చెబుతాడు. అందుకు భైర అంగీకరించడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం మొదలవుతుంది. దేవర మాత్రం ఊరికి దూరంగా ఉంటూ సంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తాడు. దాంతో దేవర ప్రాణం తీయడానికి పన్నాగం పన్నుతాడు భైర. ఆ తర్వాత ఏం జరిగింది. అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవర కోసం భయం భయంగా ఉండే వర  ఏం చేశాడు. అసలు రత్నగిరి, ఎర్ర సముద్రంలో ఏం జరిగింది అనేది  కథ. 
ప్లస్  పాయింట్స్  : 
• 1. తారక్‌ డ్యూయల్‌ రోల్‌   అద్భుతం  అనే  చెప్పాలి   ..  ఇందులో దేవరగా తండ్రి పాత్రలో, ‘వర’గా యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో  తనదైన  శైలిలో  నటించి ప్రేక్షకులను   బాగా   ఆకట్టుకున్నారు. దేవర పాత్రలో తారక్‌ బాడీ లాంగ్వేజ్‌, భావోద్వేగాలు  ప్రేక్షకులను  బాగా  ఆకట్టుకున్నాయి  ..

• 2. . ఆరేళ్ల తర్వాత తారక్‌ సోలోగా కనిపించిన  తారక్  పవర్ ఫుల్  యాక్షన్  తో  ప్రేక్షకులకు  ఫుల్  మాస్  విజువల్ ట్రీట్  ఇచ్చేసాడు  ..

• 3. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌కు తెలుగులో    నటించిన  తొలి చిత్రమిది.  జాన్వీ కపూర్  పాత్ర  మాత్రం  కేవలం  గ్లామర్ కె  పరిమితం అయింది ..

• 4.  విలన్‌గా భైర పాత్రలో కనిపించారు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌. సినిమాకు కీలకమైన పాత్ర  ,  తనకు  ఇచ్చిన  పాత్రకు  మాత్రం  తనవంతు  న్యాయం  చేశారు  అని చెప్పొచ్చు  ..  . అయితే హిందీ మార్కెట్‌ కోసం సైఫ్‌, జాన్వీలను ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. సింగప్ప పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ నటన   మరో లెవెల్  .. . శ్రీకాంత్‌, మురళీశర్మ, అజయ్‌, శ్రుతి  తదతరులు కీలక పాత్రల్లో పరిధి మేరకు నటించారు.
టెక్నీకల్ పాయింట్స్  : 
• టెక్నికల్‌గా సినిమా  మాత్రం  మరో లెవెల్  .. .
• విజువల్‌ ఎఫెక్ట్స్‌,  ప్రొడక్షన్‌ డిజైన్‌, క్వాలిటీ విషయంలో   ప్రొడ్యూసర్స్  ఎక్కడా  కాంప్రమైజ్  కాలేదు ..
• అండర్‌ వాటర్‌ సీన్స్‌  కోసం  బాగా ఖర్చు చేసినట్లు  తెరపై   కనిపిస్తోంది.
• రత్నవేలు సినిమాటోగ్రఫీ  మరో   విజువల్  వండర్  అని  చెప్పొచ్చు  ..
• మ్యూజిక్  డైరెక్టర్  అనిరుద్‌ బ్యాక్ గ్రౌండ్  స్కోర్  తో  ప్రేక్షకులను  అలరించాడు.
• యాక్షన్  సీన్స్  లో  ఎన్టీఆర్  అదరకొట్టాడు ..

మైనస్  పాయింట్స్   : 

కొరటాల శివ బలం రచన, ఆయన ఎన్టీఆర్‌తో చేసిన ‘జనతా గ్యారేజ్‌’లో మాటలతో మెస్మరైజ్‌ చేశారు. ఇందులో పూర్తి స్థాయిలో ఆయన రైటింగ్‌ మార్క్‌ మిస్‌ అయింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను చేరుకునే స్థాయిలో సినిమా లేదు.

చివరిగా  ..  ఈ  సినిమా   విషయంలో  అందరూ  చెబుతున్న  మాట  ఏమిటంటే  .. ఫస్ట్  హాఫ్  బాగుంది  అని  ,  సెకండ్  హాఫ్  కాస్త  డిస్సపాయింట్  చేసింది .. ఓవర్  ఆల్  గా ఎన్టీఆర్ యాక్టింగ్ ,  అలానే  అనిరుధ్  బ్యాక్ గ్రౌండ్  స్కోర్ ,  అలానే  యాక్షన్  సీన్స్ , కోసం   చూడొచ్చు  .దేవర అభిమానుల కోసం మాత్రమే ..అన్నట్లు  గా  ఉంది  .. ఏదైనా కొరటాల  శివకు   ఆచార్య  ఎఫెక్ట్   తరువాత  దేవర  కాస్త రిలీఫ్  ఇచ్చింది  అని  సినీ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading