బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి మరియు ఎయిర్ టెల్ ఫేం సశా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ‘నేనెక్కడున్నా’ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రఖ్యాత ప్రజా నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతులమీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు కె.బి.ఆర్, మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నా శుభాకాంక్షలు” అని అభినందనలు తెలిపారు.
‘నేనెక్కడున్నా’ కథ ఒక పాత్రికేయుడి (ఆనంద్ – మిమో చక్రవర్తి) మరియు అతని సహకారిణి (ఝాన్సీ – సశా చెత్రి) ఇస్తున్న శక్తివంతమైన స్టింగ్ ఆపరేషన్స్ ను ఆధారంగా సాగుతుంది. ఈ పాత్రలు ప్రజల జీవితాలను మార్చడానికి, అవినీతిని బయట పెట్టడానికి జర్నలిజాన్ని తమ లక్ష్యంగా ఎంచుకున్నవారు. వారు ఎదుర్కొనే సమస్యలు, ప్రమాదాలు, అవినీతిపరులు ఎలా కపటంగా వ్యవహరించారని చూపించే ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.
ఈ చిత్రంలో మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర, అర్చన గౌతం తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక బృందం:
డాన్స్: ప్రేమ్ రక్షిత్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ
సంగీతం: శేఖర్ చంద్ర
ఫోటోగ్రఫీ: జయపాల్ నిమ్మల
ఎడిటింగ్: ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ S.S
సమర్పణ: కె.బి.ఆర్
నిర్మాత: మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మాధవ్ కోదాడ
‘నేనెక్కడున్నా’ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.