“హే చికితా” చిత్రం షూటింగ్ ప్రారంభం – యువ దర్శకుడు ధన్‌రాజ్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్
ప్రముఖ నిర్మాణ సంస్థలు అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్ల పై, ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ మరియు ‘గరుడవేగ’ అంజి కలిసి భారీ బడ్జెట్ చిత్రం “హే చికితా” ను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా, యువ దర్శకుడు ధన్‌రాజ్ లెక్కల తన మొదటి చిత్రం “హే చికితా” తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
“హే చికితా” చిత్రంలో, యువ కథానాయకుడు అబినవ్ మణికంట మరియు దివిజ ప్రభాకర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి టైటిల్ ను లాంచ్ చేయగా, అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్, వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్ర షూటింగ్ వాలెంటైన్స్ డే సందర్భంగా, ఈ రోజు నుండి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు అద్భుతమైన లొకేషన్లలో ప్రారంభమైయింది. శరవేగంగా షూటింగ్ కొనసాగుతుంది.
“హే చికితా” చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, “గరుడవేగ” ఫేమ్ అంజి సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తున్నారు. మధు ఎడిటర్ గా, రవిందర్ బెక్కం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఈ చిత్రంలో భాగస్వాములయ్యారు.
ప్రముఖ సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: ధన్‌రాజ్ లెక్కల
మ్యూజిక్: చరణ్ అర్జున్
డీవోపీ: ‘గరుడవేగ’ అంజి
ఎడిటర్: మధు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవిందర్ బెక్కం
కొరియో గ్రఫి: కపిల్, జె డి
కాస్ట్యూమ్ డిజైనర్: నల్లాపు సతీష్
ఫైట్ మాస్టర్: కృష్ణంరాజు
పి ఆర్ ఓ: తేజస్వి సజ్జా
డిజిటల్ మీడియా: యాష్ టాగ్ మీడియా
నటీనటులు:
అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి, మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
నిర్మాణం: ఈ చిత్రాన్ని ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ మరియు ‘గరుడవేగ’ అంజి నిర్మిస్తున్నారు.
“హే చికితా” చిత్రం, సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ మరియు ట్రైలర్స్ విడుదల కానున్నాయి.