‘మ్యాక్స్’ మూవీ డిజిటల్ ప్రీమియర్ ZEE5లో ఫిబ్రవరి 15న

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ చిత్రం ఫిబ్రవరి 15న ZEE5 ఓటీటీ వేదికలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రాత్రి 7:30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. 2024లో కన్నడ సినిమాల ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం, మాస్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘మ్యాక్స్’ సినిమా నూతన దర్శకుడు విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కింది. కిచ్చా సుదీప్ ‘పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్’ పాత్రలో ఒక గ్యాంగ్‌స్టర్‌ను వెంటాడే నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. సుదీప్ యొక్క మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుని, గంటా మంచి స్పందన పొందింది. ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ మంచి ఆదరణ పొందింది.

‘మ్యాక్స్’ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కలైపులి ఎస్. థాను (వి క్రియేషన్స్) మరియు కిచ్చా సుదీప్ (కిచ్చా క్రియేషన్స్) నిర్మించిన ఈ చిత్రం, 2024లో అత్యధిక వసూళ్లను సాధించి, అత్యధిక గ్రాసర్గా నిలిచింది.

కిచ్చా సుదీప్ మాట్లాడుతూ, “నా సినిమా ‘మ్యాక్స్’ ZEE5లో స్ట్రీమింగ్ అవ్వడం నా కోసం గర్వకారణం. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన క్షణం నుండి ప్రేక్షకుల నుంచి ప్రేమని పొందింది. నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం ఇచ్చిన ‘అర్జున్ మహాక్షయ్’ పాత్రలో నటించడం ఎంతో సంతృప్తినిచ్చింది. సినిమా మొత్తం యాక్షన్, ఎమోషన్ మరియు ఇంటెన్స్ డ్రామా తో నిండినది. ఇప్పుడు ఈ సినిమా ZEE5 ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు చూసి ఆనందించగలరని ఆశిస్తున్నాను” అని అన్నారు.

‘మ్యాక్స్’ ఫిబ్రవరి 15న ZEE5 లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతోంది, మరియు అన్ని భాషలలో ప్రేక్షకులు ఈ హై ఆక్టేన్ థ్రిల్లర్ ను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

తాజా వార్తలు