చిరంజీవి అనిల్ కాంబోలో రాబోతున్న మూవీ… పూర్తి వినోదాత్మకంగా ఉండనుందట. వేసవిలో సినిమాను మొదలు పెట్టి సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం మూవీని కేవలం 72 రోజుల్లోనే తెరకెక్కించిన అనిల్…. చిరు మూవీపై కూడా అలాంటి ఫోకస్ పెట్టబోతున్నాడట. అంతేకాక చిరు మూవీ కంప్లీట్ అయిన తర్వాత మరోసారి వెంకటేష్ ను మూవీ చేయనున్నాడట. వెంకీ అనిల్ మూవీ కూడా సంకాంత్రికే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట.

చిరంజీవితో అనిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ..2027 పొంగల్ కు కానున్న రిలీజ్..!

ఫెస్టివల్ హిట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాడు ఆ యంగ్ డైరెక్టర్. కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకముందే… ఏదో పండగకు ముందే కర్చీఫ్ వేసుకుంటున్నాడు. ఎప్పటిలానే పండగకు ఫిక్స చేసుకోవడమే కాదు… క్రేజీ ప్రాజెక్టును లైన్ లో పెట్టేస్తున్నాడు.

యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దూకుడు మాములుగా లేదు. వ‌రుస‌గా హిట్లు కొట్ట‌డ‌మే కాదు.. అందులోనూ పండ‌గ‌ల‌నే టార్గెట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. భగవంత్ కేసరీ తో దసరాను టార్గెట్ చేసి… హిట్ కొట్టేశాడు. రీసెంట్ గా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో పొంగల్ విజేతగా నిలిచాడు. ప్ర‌స్తుతం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనిల్… తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను క్రేజీ కాంబినేష‌న్లో సెట్ చేసుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ఆల్మోస్ట్ క‌న్ఫామ్ చేసుకున్నాడు. విశేష‌మేమిటంటే.. ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లని ఈ మూవీ మరోసారి సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

బాస్ తో అనిల్ ఎలాంటి మూవీని ప్లాన్ చేయబోతున్నాడు. క్లాస్ తో కొడతాడా… లేదా మాస్ తో బ్లాస్ట్ చేస్తాడా … ఈ రెండు కాక తనదైన కామెడీతో బాక్సాఫీస్ బరిలోకి దింపుతాడా..ఇంతకి యంగ్ డైరెక్టర్ ప్లాన్ ఏంటి…

మెగాస్టార్ మూవీతో చేయబోయే సినిమాను ప్రెస్టేజియ‌స్‌గా తీసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందులోనూ కొణిదెల సుష్మిత నిర్మాణ భాగ‌స్వామిగా వ్యవహరించనున్నారు. దీంతో అప్పుడే హాట్ టాపిక్‌గా మారింది ఈ మూవీ. ఈ మూవీని సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ చిరు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విశ్వంభర చివరి దశలో ఉండ‌గా.. నెక్ట్స్ దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను ప్రకటించారు. దీని త‌ర్వాత మెగాస్టార్ తో మూవీ ఉండ‌నుంది. సెంటిమెంట్‌గా ఈ నెల 17, 18 తేదిల్లో వైజాగ్‌లో ఈ చిత్రానికి ‘ఓం’ రాసి కథా చర్చలు మొదలుపెట్టనున్నారు

చిరంజీవి అనిల్ కాంబోలో రాబోతున్న మూవీ… పూర్తి వినోదాత్మకంగా ఉండనుందట. వేసవిలో సినిమాను మొదలు పెట్టి సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం మూవీని కేవలం 72 రోజుల్లోనే తెరకెక్కించిన అనిల్…. చిరు మూవీపై కూడా అలాంటి ఫోకస్ పెట్టబోతున్నాడట. అంతేకాక చిరు మూవీ కంప్లీట్ అయిన తర్వాత మరోసారి వెంకటేష్ ను మూవీ చేయనున్నాడట. వెంకీ అనిల్ మూవీ కూడా సంకాంత్రికే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. వరుసగా 2026, 2027 కి తన మూవీలను సంక్రాంతికి లాక్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


Discover more from EliteMediaTeluguNews

Subscribe to get the latest posts sent to your email.

Discover more from EliteMediaTeluguNews

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading