హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మదం’ కోసం చిత్రయూనిట్ సరికొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు) మరియు రమేష్ బాబు కోయ నిర్మాణంలో, వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం, ‘మదం’ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
డైరెక్టర్ వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ
“మా ‘మదం’ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మా నిర్మాత రమేష్ గారి కథని చూస్తూ నాకు చాలా భయమేసింది. ఈ రా, రస్టిక్ సినిమా తెలుగులో అరుదుగా వస్తుంది. తమిళ్, మలయాళ భాషల్లో ఇలాంటి కంటెంట్ రావడం సాధారణం, కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త అనుభవం. ఈ సినిమా చివర్లో ఉన్న క్లైమాక్స్ భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు కనిపించలేదు. ఈ చిత్రాన్ని చూడాలంటే ప్రేక్షకులకు గుండె ధైర్యం కావాలి,” అని వంశీ కృష్ణ మల్లా చెప్పారు.
రైటర్ రమేష్ బాబు కోయ మాట్లాడుతూ
“నా కథను అద్భుతంగా తీర్చిదిద్దిన వంశీ గారికి చాలా థాంక్స్. మా ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. టీజర్‌కు ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు,” అన్నారు రమేష్ బాబు కోయ.
ఇనయ సుల్తానా మాట్లాడుతూ
“నేను నెగెటివ్ పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. ఈ సినిమాలో నేను చాలా ముఖ్యమైన పాత్రను పోషించాను. మా డైరెక్టర్ వంశీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. ఆయన మద్దతు నాకు చాలా ముఖ్యమైంది. నేను బాగా నటించడానికి ఆయనే కారణం. లత నాకు మంచి స్నేహితురాలు. హర్ష చాలా రియలిస్టిక్‌గా నటించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. మార్చి 14న సినిమా విడుదల కానుంది. అందరూ చూడండి,” అని ఇనయ సుల్తానా చెప్పారు.
హర్ష గంగవరపు మాట్లాడుతూ
“’మదం’ సినిమా కథే హీరో. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. కథ చాలా బాగుంది. ప్రతి పాత్రకు సరిపడే నటన అందరికీ ఉన్నది. మా రమేష్ గారి కథ మరియు వంశీ గారి దృష్యవిహారం అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం అన్ని తరగతుల ప్రేక్షకులకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను,” అని హర్ష గంగవరపు అన్నారు.
లతా విశ్వనాథ్ మాట్లాడుతూ
“ఈ చిత్రం లో నాకు నిజ జీవితంలో దగ్గరగా ఉండే పాత్రను పోషించాను. అందుకే నాకు ఎక్కడా కష్టంగా అనిపించలేదు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థాంక్స్. ఇనయతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. హర్షతో నటించడం కూడా సంతోషంగా ఉంది. మా సినిమా మార్చి 14న విడుదల కానుంది. అందరూ సపోర్ట్ చేయండి,” అన్నారు లతా విశ్వనాథ్.
‘మదం’ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం టీజర్‌కు విశేషమైన స్పందన వస్తుండటంతో, ఈ సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.