ఏపీ  SAP Chairman గా రవి నాయుడు

అనిమిని రవినాయుడు రాష్ట్ర శ్యాప్ ఛైర్మన్‌గా నియామకం

సెప్టెంబర్ 24, 2024న అనిమిని రవినాయుడు రాష్ట్ర శ్యాప్ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీకి విధేయత చూపినందుకు, తన కృషితో పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి ఆయనకు దక్కింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, యువ నేత నారా లోకేష్ ఇచ్చిన ప్రేరణతో రవినాయుడు విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి పార్టీకి ముఖ్యనాయకుడిగా మారారు.

విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రవినాయుడు ఎంతటి కష్టమైన పనులు అప్పగించినా 200 శాతం న్యాయం చేయడమే కాదు, ఏ పదవి ఆశించకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆయనపై 57 తప్పుడు కేసులు నమోదు చేసినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా, మరింత ఉత్సాహంతో పార్టీ నిర్ణయాలను పాటిస్తూ పని చేశారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నేడు శ్యాప్ ఛైర్మన్ స్థాయికి ఎదగడం రవినాయుడు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టంగా నిలిచింది.

‘‘2005లో ఓరియంటల్ కాలేజీ అధ్యక్షుడిగా, 2006లో చంద్రగిరి నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా, 2007లో ఎస్.వి యూనివర్సిటీ టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా, ఆపై 2010, 2015లో టిఎన్ఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. నాపై నమ్మకం ఉంచిన చంద్రబాబు గారు, లోకేష్ గారికి నేను రుణపడి ఉంటాను. నాకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తాను,’’ అని రవినాయుడు తన ప్రకటనలో తెలిపారు.

తాజా వార్తలు