Sake Sailajanath: మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2023లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో శైలజానాథ్ ఆ ప్రయత్నం విరమించుకున్నారు.