Amaravati : అమరావతి పనులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాయగా.. ఎన్నికలు పూర్తయ్యాకే టెండర్లు ఫైనలైజ్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.