హైదరాబాద్, లిబర్టీ: మాజీ ఎంపీ శ్రీ వి. హనుమంతరావు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దీక్ష ప్రారంభించారు. టీటీడీ ప్రసాదంగా ఉన్న పవిత్ర లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తూ వి.హెచ్ దీక్షకు పూనుకున్నారు.
విచారణపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ, సీబీఐ పరిశీలన జరిగే వరకు తన దీక్షను కొనసాగిస్తారని వి.హెచ్ తెలిపారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.
మరిన్ని వివరాలకు మాకు సమచారం అందుబాటులోకి వస్తే త్వరలోనే అప్‌డేట్ చేస్తాము.