సినిమా టైటిల్‌ను రిపీట్‌ చేస్తూ సినిమాలు రావడం కామనే. అయితే ఇద్దరు హీరోలు నటించిన వేర్వేరు చిత్రాలకు ఒకే టైటిల్‌ పెట్టడం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో పైగా ఇద్దరికి 25వ సినిమాకు ఒకే టైటిల్స్‌ అనౌన్స్‌ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయ్‌ ఆంటోనీ నటిస్తున్న ‘శక్తి తిరుమగణ్‌’ ను తెలుగులో ‘పరాశక్తి’ టైటిల్‌ పెట్టడంతో పాటు సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ప్రకటించాడు. ఇటు శివకార్తీకేయన్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ లో పరాశక్తి టైటిల్ వివాదం వచ్చింది

వివాదాలుగా సినీటైటిల్స్ ,,, ఒకే పేరుతో రెండు సినీ టైటిల్స్ …కోలీవుడ్ లో మొదలైన చర్చ ..!

  • పరాశక్తి అంటోన్న విజయ్ అంటోని, శివకార్తికేయన్
  • ఇద్దరి 25వ సినిమాకు ఒకే టైటిల్ అనౌన్స్
  • అప్పటికే రిజిస్టేషన్ చేసుకున్న చిన్న నిర్మాతలు


ఏ సినిమాకైనా ముందుగా కావాల్సింది అదే. ప్రమోషన్ చేయాలన్నా… ఆడియెన్స్ నోళ్లలో నానాలన్నా.. అదే ముఖ్యం. అది లేకుంటే సినిమానే లేదు. అంతటి ముఖ్యమైన విషయమే సినిమాకు ప్రాబ్లంగా మారితే… అదే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే… ఎలా ఉంటుంది… కోలీవుడ్ లో ఓ రెండు సినిమాలకు ఇప్పుడు అదే కష్టం వచ్చింది.

ఏ సినిమా ప్ర‌మోష‌న్ కైనా అత్యంత ముఖ్య‌మైన‌ది టైటిల్. దానితో స‌గం ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మూవీకి స్టోరీ ఎంతో ముఖ్యమో.. టైటిల్ అంత కంటే కూడా ముఖ్యం. క‌థ‌ను ఒక్క మాట‌లో చెప్పాల‌న్నా, హీరో ఎలివేష‌న్స్ ఒక్క పేరులో చూపాల‌న్నా.. టైటిలే ప్ర‌ధానం. అందుకే సినిమాకు యాప్ట్ టైటిల్‌ కోసం దర్శక నిర్మాతలు తలబద్దలుకొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వెయ్యరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు అసరమతే పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో వెండితెరపై సందడి చేసిన టైటిల్.. ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. గతంలో ఒకే టైటిల్‌తో చాలా సినిమాలు చాలానే తెర‌కెక్కాయి. కానీ ఇప్పుడు ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకే సారి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

పాత సినిమాలను తిరిగి వాడటం వేరు. వాటికి ఏదో తోక తగిలించి ప్రచారంలోకి తీసుకురావడం వేరే. కానీ కోలీవుడ్ హీరోలు ఎవరూ చేయని ప్రయోగం చేస్తున్నారు. ఒకే రోజు ఒకే టైటిల్ తో సినిమాలు ప్రకటించి ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీశారు.

సినిమా టైటిల్‌ను రిపీట్‌ చేస్తూ సినిమాలు రావడం కామనే. అయితే ఇద్దరు హీరోలు నటించిన వేర్వేరు చిత్రాలకు ఒకే టైటిల్‌ పెట్టడం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో పైగా ఇద్దరికి 25వ సినిమాకు ఒకే టైటిల్స్‌ అనౌన్స్‌ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయ్‌ ఆంటోనీ నటిస్తున్న ‘శక్తి తిరుమగణ్‌’ ను తెలుగులో ‘పరాశక్తి’ టైటిల్‌ పెట్టడంతో పాటు సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ప్రకటించాడు. ఇటు శివకార్తీకేయన్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు.

ఇప్పుడు కోలీవుడ్ లో పరాశక్తి టైటిల్ వివాదం వచ్చింది కానీ.. తెలుగులో గతంలో మహేష్ త్రివిక్రమ్ ల ఖలేజా , కల్యాణ్ రామ్ కత్తి , నాని గ్యాంగ్ లీడర్ సినిమాల సమయంలో టైటిల్ వివాదం నెలకొంది. అప్పటికే కొందరు చిన్న నిర్మాతలు ఖలేజా , కత్తి , గ్యాంగ్ లీడర్ సినిమాల టైటిల్స్ ను రిజిస్టర్ చేసుకోవటం జరిగింది‌. వారి నుంచి టైటిల్ తీసుకొవటానికి మహేష్ కల్యాణ్ రామ్ నాని సినిమాల నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ చిన్న నిర్మాతలు ఒప్పుకోకపొవటం…, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయటంతో చివరికి సదరు సినిమాలకు మహేష్ ఖలేజా , కల్యాణ్, రామ్ కత్తి నానీస్ గ్యాంగ్ లీడర్ అంటూ టైటిల్స్ రిజిస్టర్ చేయించి రిలీజ్ చేసేశారు. అంతేకాక టైటిల్ వివాదం వల్ల ఆ సినిమాలకు అప్పట్లో ఫ్రీ పబ్లిసిటీ కూడా బాగా లబించింది. కత్తి సినిమా టైటిల్ వివాదాన్ని పరిష్కరించెందుకు స్వయనా దాసరి రంగంలోకి దిగారు. ఇక పరాశక్తి టైటిల్ వివాదం కూడా కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. విజయ్ ఆంటోనీ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నా..శివకార్తికేయన్ సినిమా వెనుక ఉదయనిధి రెడ్ జెయింట్ సంస్థ‌ ఉంది కాబట్టి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అనే చర్చ నడుస్తుంది.

తాజా వార్తలు