చిన్మయి సంచలన వ్యాఖ్యలు: “మహిళలకు ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదు”

ప్రఖ్యాత గాయకురాలు చిన్మయి శ్రీపాద ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చకు గురయ్యారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి, ఆమె మహిళల రక్షణ గురించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోలో, బస్సులో ఓ వ్యక్తి ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. దీనిపై చిన్మయి స్పందిస్తూ, “మన దేశంలో రవాణా వ్యవస్థ ఇలాగే ఉంటుంది, ఇలాంటి వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారు” అన్నారు.

చిన్మయి పోస్ట్‌లో పేర్కొన్నారు, “మీ అమ్మాయి లేదా కూతురు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆమెకు ఓ స్కూటీ కొనివ్వండి. అదే ఆమెకు సేఫ్ అవుతుంది. ఆలయాల్లో కూడా క్యూలో నిలబడినప్పుడు ఇలాగే జరుగుతోంది” అని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇందులో, “అలాగే మీరు చూడొచ్చు, ఆ యువతీ చున్నీ వేసుకుని, దుపట్టా కప్పుకుని ఉంది. అయినా అతడు అలా ప్రవర్తిస్తున్నాడు. మీరు మీమ్స్ చేయడం మానవండి, అసలు అక్కడ అతని బుద్ధి వంకరగా ఉంది. మగాళ్లందరినీ ఇళ్లలో ఉంచితే మహిళలకు బయట అంతా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్లు సురక్షితంగా బయట రాగలిగినా కూడా, ఇళ్లలో కూడా వేధించే వారు ఉంటారు” అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతూ, మహిళల రక్షణ గురించి సమాజంలో మరింత చర్చ మొదలైంది.


Discover more from EliteMediaTeluguNews

Subscribe to get the latest posts sent to your email.

తాజా వార్తలు

Discover more from EliteMediaTeluguNews

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading