హిందువుల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారు*- టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్*

తిరుపతి లడ్డు అపవిత్రం అయిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్ అన్నారు.
ఈ సందర్భంగా సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ…
‘‘ జగన్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దేశ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధకు గురయ్యారు. ఇందులోని నిజాలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ వైసీపీ హిందూవుల మనోభావాలతో ఆడుకుంటున్న మాట యధార్థం. మీరు గనుక గత 5 సంత్సరాల్లో గనుక చూసినట్లైతే వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హిందువుల పండుగులకు గాని, హిందువుల గుడులకు గాని పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఎప్పుడూ లేదు. గతంలో వినాయక చవిత జరపాలన్న, దశరా నవరాత్రులు జరపాలన్న, సంక్రాంతి ఉత్సవాలు జరపాలన్న, ఉగాది చేయాలన్న లేదా ఇంకొక పండుగ చేయాలన్న అన్నీ ఆటంకాలే. ఈ హిందూ వ్యతిరేకి జగన్ మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో హిందువులను, హిందూ మతాన్ని గౌరవించకుండా కేవలం తన ఒంటెద్దు పొకడతో హిందువులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. కాని మనందరికీ తెలియని విషయం ఏమిటంటే హిందువులు దేవుడిగా భావించి తిరుమల కొండ వెళ్లడానికి జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. తిరుమల దేవుడి నుంచి పిలుపు వస్తే.. కుటుంబ సమేతంగా, కుటుంబంలో జరగాల్సిన ఒక పెద్ద కార్యాన్ని కంప్లీట్ చేస్తే, పెళ్లి చేయడమో, పిల్లల పెళ్లిళ్లు చేయడమో, ఇల్లు కట్టుకోవడమో లేదా ఎవరికైన పిల్లలు పుట్టాల్సిన వారికి పిల్లలు పుడితేనో, వారి పుట్టెంటుకులు తీపించడానికో మొక్కుబడిగా తిరుపతి వెళతారు. వారి జీవితంలోనే తిరుపతి వెళ్లడం అనేది ఒక పెద్ద అంశం. చాలా మంది హిందువులకు అది ఒక పెద్ద అంశం తిరుపతి వెళ్లడం అంటే. చిరు చిరు చిన్న చిన్న కుటుంబ సభ్యులు డబ్బులు చాలకపోతే నలుగురు సన్నిహితుల దగ్గర కూడా డబ్బులు పోగేసుకొని దేవుడి దగ్గరకు వెళ్లి మొక్కులు తీర్చుకున్న పరిస్థితి మనం చూశాం. ఏడు కొండలు ఎక్కి.. ఆ దేవుడిని దర్శించుకోవడానికి రెండు రోజులు, మూడు రోజులు, ఎంత ఇబ్బందైనా కూడా అక్కడే ఉండి, ఆ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి హిందువులంతా కూడా తాపత్రాయపడిపోతారు. అటువంటి అంత పెద్ద నమ్మకం.. హిందువులందరికి వెంకన్న స్వామి అంటే. ఆ వెంకన్న స్వామి గుడిలో స్వామి వారిని దర్శించుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆ ఒక్క సెకండ్ అనుభూతి ఎప్పుడైతై పొందుతామో అలాగే తిరుపతి లడ్డూ తిన్నా కూడా అంతే అనుభూతి పొందుతాము. ఎవరైనా తిరుపతి వెళుతున్నారంటే.. ఏవండి మాకో లడ్డూ తెచ్చిపెట్టండి, ఆ లడ్డూ ప్రసాదం మాకు పంపించండి అని ఇంటి పక్కన వాళ్లు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చెబుతారు. మరి అంత పవిత్రత కలిగిన తిరుపతి లడ్డూను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన పని తెలుసుకుంటే హిందువులందరూ కూడా బోరుమని ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం అండి. ఎక్కడైనా సరే ఎవరైన సరే హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా. వెంకన్న స్వామిని దర్శించుకొని.. లడ్డూ ప్రసాదం తీసుకొని భక్తులకు పంచే హిందువులకు ఇంత కర్మ పట్టిందంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరమాల్సిన అవసరం ప్రతి ఒక్కరకి కూడా ఉందని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. అసలు ఎక్కడికి వెళుతోంది ఈ జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది. అరె పెద్ద పెద్ద సంస్థలు ఇందులో క్వాలిటీ నెయ్యి వాడలేదు, తప్పుడు పదార్థాలు వాడారు అని భారత దేశంలోనే ప్రఖ్యాత చెందిన సంస్థలు చెబుతా ఉంటే జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మా వాడు సచిహీనుడు, మా వాడు సూపరు, మా వాడు డూపరు.. అని చెప్పి వారి రెడ్డి మిత్రులకు సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరడిగారు నీ సర్టిఫికెటు? అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా? ఎలా జరిగిందో తెలియజేయాలి కదా ? భక్తుల మనోభావాలు ఏంటో తెలుసుకోవాలో కదా, నువ్వు చెప్పినంత ఈజీఆ. నీ నలుగురు మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తులను కూర్చోబెట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేస్తే అయిపోయిందనుకున్నావా జగన్ మోహన్ రెడ్డి. హిందువుల మనోభావాల గురించి నీకు తెలుసా ? ఎప్పుడైన సరే నువ్వు కుటుంబ సమేతంగా వెళ్లి ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్నావా ? ఏ గుడికి అయినా సరే నువ్వు మీ సతీమణిని తీసుకొని గుడికి వెళ్లావా ? ఎప్పుడైనా సరే వెంకన్న స్వామి సెట్టును ఇంట్లో వేయించుకున్న మూర్ఖుడివి నువ్వు ఈ రోజు నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావ. తిరుపతిలో ఇంత పరిస్థితి జరుగుతా ఉంటే నీ ఛైర్మన్లు ఏమి చేశారు ? ఎవరిని నువ్వు పెట్టింది ? ఇద్దరు అన్యమతస్తులను నువ్వు ఛైర్మన్లగా నియమించి నీ హయాంలో తిరుపతిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దుపోకడతో వెళ్లి ఈ రోజు హిందు మనోభావాలతో ఆడుకొని ఈ రోజు మళ్లీ నువ్వు మాట్లాడానికి ముందుకొచ్చావంటే సిగ్గుండాలి జగన్ మోహన్ రెడ్డి. ప్రజలు నిన్ను నమ్మి ఒకప్పుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు మరో సారి రుజువు చేశావు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తోక వంకరే అని నీ బుద్ధి చూపించావు. నీ బుద్ధి ఆ రోజు ప్రజలకు చూపించావు. ఈ రోజు ప్రతి అంశం కూడా బయటకు వస్తా ఉంది. నువ్వు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతా ఉన్నాయి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా చూస్తూ వదలం. హైకోర్టులో పిల్ వేశావ్. ఎందుకు హై కోర్టు వారు ఈ రోజు సోమవారం రోజు అఫిడవిట్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు నువ్వు ? దానికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు ? రిపోర్టులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? జరిగిన కల్తీ గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావ్ ? నీ హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయో తెలుసా ? ఎన్ని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో తెలుసా ? హిందు అనే వాడిని లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం హిందువులందరికి తెలయదనుకుంటున్నావా. సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవుడి మీద నమ్మకంతో అందరం కూడా ముందుకు వెళతా ఉన్నాం. అటువంటిది నీ 5 సంవత్సరాల కాలంలో అందరినీ పాతాళానికి తొక్కే ప్రయత్నం చేశావ్. నీ తోటి ఎమ్మెల్యేలు, నీ తోటి మంత్రులు ఏం మాట్లాడారు ఆ రోజు ? ఎక్కడకి వెళ్లిపోయారు వాళ్లంతా ? తీసుకురండి బయటకు. చెప్పమనండి. స్వామి వారి చెయ్యి విరిగితే ఏమౌతుందా. సింహం పోతే ఏమౌతుందా. ఈ మాట్లాడిని వ్యక్తులు నీ పక్కన ఉన్న వ్యక్తులు కాదా ? ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి. ఇందులో ఈ కుట్రలో జగన్ మోహన్ రెడ్డితో పాటు అక్కడ ఛైర్మన్లగా పని చేసిన వారితో పాటు ఇంకొక అఘ్నాత వ్యక్తి ఉన్నాడు. అతనే విజయవాడ ప్రాంతానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్. ఆ రోజు దేవాదాయశాఖ మంత్రిగా ఉండి, అతను దగ్గరుండి ఈ కార్యకలాపాలన్ని చేయించాడు. దగ్గరుండి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాడు. హిందు వ్యతిరేకులు అంతా ఒక చోట కలిసి హిందువులను, దేవుడిని, దేవుడి గుడులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా. బి క్లాస్ బెంచ్ 2022 మోడల్ TS08JP4444 ఈ బెంజ్ కారు ఎక్కడ నుంచి వచ్చిందయ్యా నీకు ? నీ అఫిడవిట్లో చూపించిన ఈ బెంజ్ కారు ఎక్కడ నుంచి వచ్చింది 2022వ సంవత్సవరంలో ? నేను చెప్పనా.. ఏఆర్ ఫ్రూట్స్ వాళ్లు నీకు గిఫ్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్టు ఇచ్చినందుకు ఈ బెంజ్ కారు నీకు గిఫ్ట్ వచ్చింది. ఆ తరువాత అదే బెంజ్ కారులో కాన్వాయ్ పోలీస్ సెక్యూరిటీతో పెట్టుకుని ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు నువ్వు జగన్ మోహన్ రెడ్డి అందజెప్పావో కూడా త్వరలో మీడియాకి తెలియజేస్తాం. ఈ రోజు హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ హిందువులు భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగులను కించపరిచావు. హిందువులు భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లి పూజలు నిర్వహించుకునే గుడులు మీద దాడులను ప్రోత్సహించావు. నీ ఐదేళ్ల కాలంలో 1200 గుడులు మీద దాడులు జరిగితే ఒక్కడంటే ఒక్కడైనా దొరికాడా జగన్ మోహన్ రెడ్డి ? ఒక్కడైనా ఎక్కడైనా సరే గుడి మీద దాడి జరిగిన వ్యక్తి ఈ ఐదేళ్లలో ఎక్కడైనా దొరికాడా ? దయచేసి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గరవుతూ హామీలు చెబుతూ, పాంప్లీట్ మీద రాసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా తెలియజేసుకుని అందరితో పాటు ముందుకు వెళుతా ఉంటే, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తా ఉంటే ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు సిగ్గనిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి. ఆలోచించు ఒకసారి. ప్రజలను వెళ్లి అడుగు. పబ్లిక్ లోకి ఇవాళ్టికైనా రా. ఆ గోడలు, రేకులు అడ్డుపెట్టుకుని కూర్చుంటే నీకేమి తెలియవు. ఆ బెంగులూరు ప్యాలెస్ లోనో, తాడేపల్లి ప్యాలెస్ లోనో ఉంటే నీకేమి తెలియవు. బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడు. ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో నీకు చెబుతారు. మేము వాళ్లు ఎంత హ్యాపీగా ఉన్నారో కూడా వాళ్లందరూ కూడా నీకు వివరిస్తారు. అయినా సరే ఏదైతే జగన్ మోహన్ రెడ్డి అనే కంపెనీ హిందువుల మనోభావాలతో ఆడుకుందో, హిందువులందరిని ఇబ్బంది పెడుతూ, హిందువుల పండుగులకు గాని, హిందు దేవాలయాలకు గాని, చివరికి వెంకన్న ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి కంపెనీ అనే మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. హిందువుల మనోభావాలను కాపాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళుతుంది. ఏదైతే వీటిపైన నిస్పాక్షపక్షంగా ఎంక్వైరీ చేసి త్వరలోనే అందరి సంగతి తేలుస్తాం. దీనిలో ఎవరెవరి పాత్రలు ఉన్నాయో, ఎక్కడ నుంచి ఎక్కడకు డబ్బులు రీరూట్ అయినాయో అన్ని తేలుస్తాం. రివర్స్ టెండరింగ్ పేరుతో నీ ఇష్టం వచ్చినట్లు చేసి 319 రూపాయలకు కల్తీ నెయ్యిను కొంటావా గుడికి. సిగ్గుందా జగన్ మోహన్ రెడ్డి నీకు. 319 రూపాయలకు ఏమి వస్తది జగన్ మోహన్ రెడ్డి. నీ ఇంట్లో వాడే నెయ్యి అదేనా ? నువ్వు ఏ రోజైనా సరే ఆ నెయ్యిని టేస్టు చూశావా ? ఏం మాట్లాడుతున్నావ్ ? హిందువుల మనోభావాలతో ఆడుకుంటావా. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తావా. ఎంత గోరమైన విషయం ఇది. ఏ హిందువు కూడా సనాతన థర్మం ప్రకారం దేవుడిని పూజించే ఏ వ్యక్తి కూడా ఈ అంశాన్ని ఊరుకోరు. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసిందాన్ని ప్రభుత్వం నిస్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని అందరూ కూడా కోరడం జరుగతది. త్వరలోనే ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇందులో ఎవరెవరైతే పాత్రులు ఉన్నారో ప్రతి ఒక్కిరిని శిక్షించేంతవరుకూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే నెయ్యి విషయం ఉందో ఈ చాలా అంశం ప్రజలు తెలుసుకోవాలి. ఈ రోజు మార్కెట్లో 600 తక్కువకు ఎక్కడా కూడా నెయ్యి దొరకదు. అటువంటిది 319 రూపాయలకు నెయ్యి తీసుకొచ్చి పెట్టాడంటే అక్కడ దానిలో ఎంత కల్తీ నెయ్యి ఉందో అందరూ తెలుసుకోవాలి. నేను చెబితేనో, ఇంకొకరు చెబితేనో కాదు ఇండియా ప్రఖ్యాతిగల సంస్థలు చెబుతా ఉన్నాయి ఈ నెయ్యి కల్తీ అని. ఆ సంస్థలు ఎన్నో రకాల విషయాల్లో ఫుడ్ ఎంక్వైరీ చేసి చెప్పినాయి. ఒకటికి నాలుగు సర్టిఫికెట్లు వచ్చినయి వాడిన నెయ్యి కల్తీ అని. వాడిన నెయ్యిలో రకరకాల పధార్థాలు ఉన్నాయి, అవి మా నోటితో మేము చెప్పలేమని క్లీయర్ గా చెబుతా ఉన్నారు. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి వీళ్ల బంధువులైన ఇద్దరి రెడ్లని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప దీని మీద ఎంక్వైరీ చేయండి, దీని మీద ముందుకెళదాం, అవసరమైతే దీని మీద ఎక్కడిదాకైనా మేము ఎంక్వైరీకి సిద్ధం అని ఒక్క మాట మాట్లాడలేక పోతున్నాడు ఈ జగన్ మోహన్ రెడ్డి. ఎందుకో తెలుసా అతని ద్వారా తెలుసు తద్వారా దీని ద్వారా అతని ఎన్ని డబ్బులు ముట్టినాయో, ఈ మధ్యలో వ్యవహరించిన వెలంపల్లి శ్రీనివాస్ కి ఎన్ని డబ్బులు ముట్టినాయో ప్రతి అంశం కూడా వారికి అన్నీ తెలుసు. కావున ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లడ్డూను అపవిత్రం చేసిన జగన్ మోహన్ రెడ్డిని ఏ విధంగా గుణపాఠం వెంకన్న స్వామి ఇంటికి పంపిచారో వై నాట్ 175 అన్న వ్యక్తిని వై నాట్ 17 కూడా లేకుండా చేశారని అందరికి తెలుసు. కాని ఇంకొక విషయం కూడా మనమందరం తెలుసుకోవాలి. ఈ లడ్డూ అపవిత్రం కావడం ఎవ్వరూ కూడా ఈజీగా తీసుకోకూడదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైన సరే లోకల్ లో ఉన్న వైసీపీ నాయకులు వచ్చి దీని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గురించి ప్రశ్నించండి. ప్రతి ఒక్కరూ దీని గురిచిం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరి మనోభావాలు చాలా కీలకమైన అంశం. దేవుడితో అటలాడుకున్న వ్యక్తిని ఎవరూ కూడా చూస్తూ ఊరుకోరు. కచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద ఎంక్వైరీ చేసి నిస్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులను ప్రజల ముందు నిలబెడతాం.’’ అని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ అన్నారు


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading