తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు గల సాయి పల్లవి ప్రస్తుతం తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది .. ఆమెకు ఫ్యాన్స్ లో “లేడీ పవర్‌స్టార్” అనే టైటిల్ కూడా వుంది..
సాయి పల్లవి టాలీవుడ్ లో “ఫిదా” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .. ఇక రీసెంట్ గా సాయి పల్లవి -శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన అమరన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. అలానే ఈ సినిమాలో సాయి పల్లవి నోటి వెంట సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్స్ చెప్పడం సినిమాకే బిగ్ హైలైట్ అని చెప్పాలి.. మరి ముక్యంగా “ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్…బుల్లెట్ దిగిందా? లేదా? అనే డైలాగ్ సాయి పల్లవి చెప్పడం తో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు .. ఈ డైలాగ్‌ను సాయి పల్లవి అద్భుతంగా చెప్పడంతో జనాలు ఆమెను బోర్న్ యాక్టర్” అని ప్రశంసించారు.
“తండేల్” కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ ..
సాయి పల్లవికి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”. ఈ సినిమాలో , ఆమె కేరక్టర్‌ను మరింత ఎలివేట్ చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చుస్తునారు ..
సాయి పల్లవి మలయాళంలో నుండి బాలీవుడ్ వరకూ
సాయి పల్లవి మలయాళంలో ఇప్పటికే భారీ విజయాలు సాధించగా, తెలుగులో ఆమె సినిమాలు తగ్గిపోవడంతో తమిళ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. అయినప్పటికీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ఆమె అవకాశం ఏర్పడింది. “నార్త్ రామాయణం” అనే భారీ ప్రాజెక్టు వచ్చే ఏడాది విడుదల కానుంది. అదే సమయంలో, బాలీవుడ్‌లో ఆమీర్ ఖాన్ తనయుడి సినిమా కూడా ఆమె చేతిలో ఉంది.
ఇటీవల ఒక ప్రముఖ డైరెక్టర్ చెప్పిన కథపై సాయి పల్లవి ఫిదా అయ్యారట. ఇదే కాకుండా, తెలుగులో ఆమె లేడీ ఓరియంటెడ్ లవ్ స్టోరీలో నటించడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళంలోనే ఈ తరహా సినిమాల్లో ఆమె కనిపించినా, తెలుగులో సాయి పల్లవీ మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ అనుసరిస్తూ తన కెరీర్‌ను మరింత దూసుకుపోతున్నది. తెలుగు సినిమాలు ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఆమె నటన మాత్రం అన్ని భాషలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. “తండేల్”, “నార్త్ రామాయణం”, ఇంకా రానున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సాయి పల్లవి కెరీర్ గ్రాఫ్ మరో మెట్టు ఎక్కడం ఖాయం ..
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.