అఖండ 2' తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చేయనున్న ఓ నెక్ట్స్ ప్రాజెక్టులో అను ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో బన్నీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీల్లో ఒకదానికి అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఇండస్ట్రీలో అనిరుధ్ దూకుడు ,, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ..!

గెస్ట్ గా వచ్చాడు. అలాగే వెళ్లిపోతాడేమోలే అనుకున్నారు కానీ ఆ కొలవెరి కుర్రాడు మాత్రం జెండా పాతేస్తున్నాడు. టాలీవుడ్ టెక్నిషియన్లకు దడ పుట్టిస్తున్నాడు. చూడబోతుంటే… ఫ్యూచర్ మొత్తం కుర్రాడిదే అయ్యేలా కనిపిస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైన‌ట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలర్, దేవర తర్వాత అనిరుథ్ పేరు ఇండస్ట్రీలో రీ సౌండ్ చేస్తోంది. ఈ రెండు సినిమాలకు మనోడు అందించిన రీ రికార్డింగ్‌కు థియేటర్స్‌లో ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌తో పాటు కొన్ని సీన్స్‌ల కు అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కేక పుట్టించింది. మ్యూజిక్ తో అయన సృష్టిస్తున్న సంచలనాలకు హద్దే లేకుండా పోవడంతో…. మేకర్స్ ఆయన కోసం క్యూ కట్టడం హాట్ టాపిక్ గా మారుతోంది.

స్టార్ హీరో సినిమా అంటే చాలు… అనిరుధే ఫస్ట్ ఆప్షన్ అయిపోతున్నాడు. పాన్ ఇండియా అంటే చాలు అతని పేరే కలవరిస్తున్నారు. కట్ చేస్తే… ఈ ఏడాది వచ్చే భారీ ప్రాజెక్టులన్నీ అతగాడి ఖాతాలోనే పడిపోతున్నాయి.

కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన తెలుపుతున్నాడు. తమిళంలో అందరు హీరోలతో పని చేస్తున్న అనిరుధ్.. తెలుగులో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ముందుకెళ్తున్నారు. ప్రజెంట్ తెలుగులో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి మూవీ కి మ్యూజిక్ అందిస్తున్న ఆయన…నాని, శ్రీకాంత్ ఓదేల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుండగానే ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా రెండు బడా ప్రాజెక్స్ట్ కి అనిరుధ్ పేరు ఫిక్స్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.

అఖండ 2′ తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చేయనున్న ఓ నెక్ట్స్ ప్రాజెక్టులో అను ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో బన్నీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీల్లో ఒకదానికి అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి బన్నీ-అని కాంబో అంటే ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం.ఇవే కాకుండా మరికొన్ని బడా తెలుగు ప్రాజెక్ట్స్ ని కూడా అనిరుధ్ కొల్లగొట్టాడు.

తాజా వార్తలు