వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన రూ. 11,440 కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్ధరించబడినట్లా లేదా ఆంధ్రుల ఆత్మగౌరవం గౌరవించబడినట్లు కాదని సూటిగా విమర్శించారు.

షర్మిల మాట్లాడుతూ, “ఈ ఆర్థిక ప్యాకేజీతో ప్లాంట్ కు ఒరిగేదేమీ లేదని, ఆర్థిక కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని” తెలిపారు. “ఈ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదని” ఆమె స్పష్టం చేశారు.

“విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ లో విలీనం చేయడమే శాశ్వత పరిష్కారం. విశాఖ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడం, ప్లాంట్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు విస్తరించడం మాత్రమే అసలైన పరిష్కారం,” అని షర్మిల పేర్కొన్నారు.

ఆంధ్రుల గౌరవాన్ని నష్టపోకుండా, విశాఖ ఉక్కును నెంబర్ వన్ గా నిలబెట్టడం, ఏకైక మార్గం అని ఆమె అన్నారు. “కేంద్రం రెండు సంవత్సరాల్లో విశాఖ ఉక్కును నెంబర్ వన్ గా నిలబెడతామనడం, ఈ రోజు ఆంధ్రుల చెవుల్లో మరోసారి పూలు పెట్టినట్లే,” అని షర్మిల విమర్శించారు.

ఆమె ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై తీవ్ర ఆలోచనకు ఉతేజన కలిగిస్తాయని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు