యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం …సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది …ఎక్స్ కాప్ , వైఫ్ , ఎక్స్ లవర్ , చుట్టూ తిరిగే అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. ఇక మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ కు ఓ పక్క గేమ్ ఛేంజెర్ , డాకు మహారాజ్ , వంటి మాస్ సినిమాలు ఉన్నా , పండుగ కు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో మేము వస్తున్నాం అని ప్రమోషన్స్ లో అనిల్ చెప్పడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి .. ఇక వెంకీ కామెడీ టైమింగ్ , అనిల్ రావిపూడి టేకింగ్ స్టయిల్ , సాంగ్స్ , ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ , మీనాక్షి చౌదరి యాక్టింగ్ , అన్నిటికి ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది …
సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 350K డాల్లర్స్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఈ విషయాన్నీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశముంది.
ఇప్పటికే నెటిజన్స్ ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్‌ను మరోసారి ప్రయోగించి సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.