తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం పాల్వంచ ప్రజలకు మరింత ప్రగతి అవకాశాలు కల్పించడంతో పాటు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ప్రాంతంలో ఆధునిక సేవలు అందించడానికి ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.