టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిష, మరియు దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కావాలని అనుకున్నారు. కానీ, టీజర్ రిలీజ్ తరువాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో, మేకర్స్ కొంచెం వెనకడుగు వేశారు. ముఖ్యంగా, విజువల్స్ మరియు వి ఎఫ్ ఎక్స్ పై వచ్చిన విమర్శలు తరువాత, మేకర్స్ ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సినిమాకు సంబంధించిన వర్క్ చేసిన గ్రాఫికల్ టీమ్ ను మార్చి, కొత్త టీమ్ ను నియమించారు. ఈ మార్పుతో, మరింత మెరుగైన విజువల్స్ అందించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. నిజానికి, టీజర్ లో తప్పటడుగు చేసిన విజువల్స్ లేవు కానీ, సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీని పరిగణనలోకి తీసుకుంటూ, మేకర్స్ ఈ మార్పులు చేస్తున్నారని చెప్పాలి ..ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తోంది.