యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రముఖంగా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్బమ్ ఒక సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన మూడు పాటలు, గోదారి గట్టు, మీను, మరియు బ్లాక్‌బస్టర్ పొంగల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్ మరియు అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

మూడు పాటలు ఇప్పటికే 85 మిలియన్ల వ్యూస్‌ను దాటాయి, వాటి పాపులారిటీ, సంగీతం, మరియు చిత్రీకరణతో ప్రేక్షకులను మెప్పించాయి. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాట ప్రస్తుతం 3వ స్థానంలో ఉండి పండగ సంబరాన్ని రెట్టింపు చేసింది. అలాగే, ‘మీను’ సాంగ్ 6వ స్థానంలో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ‘గోదారి గట్టు’ సాంగ్ కూడా 10వ స్థానంలో అదరగొడుతూ, విడుదలైనప్పటి నుండి టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ పాటలు సోషల్ మీడియాలో కూడా పెద్ద హిట్స్ గా నిలిచాయి, ఫ్యాన్స్ ఈ పాటల పై డ్యాన్స్ కవర్‌లు మరియు రీల్స్ రూపొందిస్తూ, వాటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ మూడు పాటలు త్వరలోనే 100 మిలియన్ల వ్యూస్ లక్ష్యాన్ని చేరుకోనున్నాయి, ఇది ఆల్బమ్ యొక్క అద్భుతమైన విజయం నిరూపిస్తుంది.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మరియు మీనాక్షి చౌదరి అతని ఎక్స్-లవర్‌గా నటిస్తున్నారు. ఈ ప్రత్యేక పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటింగ్, మరియు జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లే అందించారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు.

ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలను సంపాదించుకుంది, పాటలతో మొదలైన విజయం సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.

విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది, మరియు ఇది ఈ సీజన్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ గా అదరగొట్టింది.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా


Discover more from EliteMediaTeluguNews

Subscribe to get the latest posts sent to your email.

తాజా వార్తలు

Discover more from EliteMediaTeluguNews

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading