హైదరాబాద్: భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి, దేశానికి గతి, గమానాన్ని నెర్పిన మహావ్యక్తి, డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సిపిఐ శాసనసభాపక్షం నాయకులు కూనంనేని సాంబశివరావు ఘన నివాళి అర్పించారు.
“ప్రపంచంలో ఐదు అధిక అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశాన్ని చేరుస్తూ, ఆర్థిక సవాళ్లను అధిగమించిన ఘనత మన్మోహన్ సింగ్‌దే,” అని సాంబశివరావు అన్నారు. ఆయన బహుముఖీన వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ, “నిజాయితీ, నిబద్ధత, స్థితప్రజ్ఞత కలిగిన మేధావి, మానవతావాది” అని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు యొక్క ఆశయాలకు సజీవ సాక్షిగా నిలిచిన మన్మోహన్ సింగ్, ప్రజా సేవ మరియు దేశ భక్తిలో మేటి వ్యక్తిగా నిలిచారు. సాంబశివరావు వివరించారు, “తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడమే గొప్ప దేశ భక్తిగా భావించిన మన్మోహన్ సింగ్ దేశానికి గొప్ప సేవలు చేశారని,” అన్నారు.
తెలంగాణ శాసనసభలో, సోమవారం, మన్మోహన్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో, సాంబశివరావు మాట్లాడుతూ, “మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారని, ప్రత్యేక తెలంగాణ అంశాన్ని సానుకూలంగా ప్రోత్సహించిన సోనియా గాంధీ సంకల్పానికి కార్యరూపం ఇచ్చి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు” అని గుర్తు చేసారు.
పదవికోసమే కాకుండా, విశ్వసనీయతకు ఎంతో అర్థం ఇచ్చిన మన్మోహన్ సింగ్, “అతని వ్యక్తిత్వం ఆర్థిక రంగంలో చేసిన మార్పులను, పౌరసేవలకు చేసిన అంకితభావాన్ని ప్రశంసిస్తూ,” ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తమ నిబద్ధతను శంకించలేదని సాంబశివరావు అన్నారు.
సాంబశివరావు, రాజకీయ అంశాలను సంతాపానికి ముడిపెట్టడం సాంప్రదాయానికి వ్యతిరేకమని అభిప్రాయపడుతూ, “మరణించిన మహానుభావానికి నివాళి అర్పించడంలో రాజకీయ అంశాలు అంగీకరించాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు.