బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సల్మాన్‌ ఖాన్, ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న “సికందర్” అనే చిత్రం. ఈ సినిమా 2025 ఈద్‌ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే, డిసెంబర్ 27న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదల కానున్నట్లు తాజా సమాచారం వెలుగుచూసింది. ఈ టీజర్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌లో సల్మాన్‌ ఖాన్‌ మాస్క్‌ అవతార్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చి, ఐదుగురు ఇతర వ్యక్తులతో కలిసి హైపర్‌ స్టైలిష్‌గా కనిపించనున్నారని బీటౌన్ సర్కిల్ సమాచారం అందించింది. ఈ టీజర్‌ అభిమానులకు విజువల్‌ ఫీస్ట్‌ను అందిస్తుందని, ఇది బాక్సాఫీస్‌ వద్ద పెద్ద హిట్‌ కావడానికీ చిహ్నం అవుతుందని తెలుస్తోంది.

“సికందర్” సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. సమాజంలో అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.