బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ పాన్ ఇండియా రికార్డులు బద్దలు… సంచలనం పుష్ప2 గురించి వినిపిస్తున్న మాటలు ఇవి. ఆడియెన్స్ అభిప్రాయాలను పక్కనబెడితే.. అసలు మ్యాటర్ మాత్రం వేరేలా ఉంది. హిట్లు కాదు… పెట్టిన ఖర్చు కూడా పుష్పరాజ్ రాబట్టకోవడం లేదన్న విషయం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
తగ్గేదేలే అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీసం మేలేస్తున్నా.. పుష్ప 2 వసూళ్ల పరిస్థితి విచిత్రంగా మారింది. పైకి అన్ని రికార్డులు, ఇన్ని రికార్డులు అని హోరెత్తుతున్నా.. అసలు సంగతి వేరే ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. అవునూ.. లెక్కలు మాస్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్పదిరూల్ ఇప్పటివరకు బ్రెక్ ఈవెన్ ను సాధించలేకపోయినట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా డల్ గా సాగుతోంది. 15 రోజులు అవుతున్నా ఇంకా మినిమమ్ వసూళ్ల దగ్గరు కొట్టుమిట్టాడుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి
దేశమంతా పుష్ప ఫీవర్ నడుస్తోందిగా మరీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఏమిటి.. అంటే ఇప్పటిదాకా వినిపిస్తున్న రికార్డుల సంగతేంటి.. అసలు పుష్పరాజ్ కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు 1600 కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలకు భారీ ధరలకు ఈ సినిమాను అమ్మడంతో బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఈ సినిమా చాలా దూరంలో ఉందని అంటున్నారు. అయితే తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు… పుష్ప 2 మేకర్స్ చేసిన అతినే ఈ పరిస్థితికి కారణమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్ట్ 1కి మించి సినిమా ఉంటుందని ఉహించుకున్న మూవీ లవర్స్… కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అల్లు అర్జున్ నట విశ్వరూపం తప్ప కంటెంట్ మిస్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రిపీటెడ్ ఆడియెన్స్ రావడం లేదని తెలుస్తోంది. పైగా సంథ్య థియేటర్ల ఇష్యూ కూడా సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.
ఇవన్నీ పక్కనబెడితే పెరిగిన టికెట్ రేట్లు కూడా ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించలేకపోయాయి. మరోవైపు థియేటర్ల రేట్లు తగ్గించినా…. మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్కడ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచినప్పటికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది