రెబల్ స్టార్ లేట్ స్టార్ అవుతున్నాడు. చేతినిండా సినిమాలు ఉన్న సమయానికి రాలేకపోతున్నాడు. ఏ సినిమా మొదలు పెట్టినా అనౌన్స్ చేసిన టైంకు రాకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందే మరో సినిమాని అనౌన్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు.‌ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది కానీ సినిమాలు మాత్రం అనుకున్న సమయానికి రాకుండా పోస్ట్ పోన్ అవుతుండటం అభిమానుల్ని నిరాశపరుస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కాలేదు. ప్రతి సినిమా కనీసం 2, 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేసుకుని థియటర్లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోందని డిజప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎంతో కొంత ఆలస్యం అయ్యేలానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాజాసాబ్ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎప్రిల్ 10న విడుదల చేసుకున్నట్లు డేట్ లాక్ చేసుకున్నప్పటికి .. ప్రభాస్ కాలికి గాయం కావడంతో వాయిదాపడే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో జర్మనీలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫుల్ రెస్ట్ తర్వాతే మారుతిసెట్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోందీ. అంతేకాక గాయం కారణంగా కల్కి జపాన్ ప్రమోషన్స్ కి రాలేకపోతున్నట్లు అభిమానులకు సందేశాన్ని పంపించాడు. దీనికి తోడు సిద్ధు జొన్నగడ్డ మూవీతో పాటు నెక్ట్స్ వీక్ అనుష్క నటిస్తున్న ఘాటీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా విడుదలపై డైలామాలో పడినట్లు తెలుస్తోంది. అయితే రాజాసాబ్ విషయంలోనే కాదు గతంలో ప్రభాస్ సినిమాలు వాయిదా పడుతు వచ్చాయి.

ప్రభాస్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ ప్రతీ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. బాహుబలి సినిమాలు కూడా అనుకున్న టైంకి రాకుండా రాజమౌళి చాలా సార్లు అపేసి రిలీజ్ చేశాడు. ఆదిపురుష్ కూడా 2, 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. అంతకుముందు రిలీజ్ అయిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ కూడా 2, 3 డేట్లు మార్చుకుని థియేటర్లోకొచ్చింది. రాధేశ్యామ్ కంటే ముందొచ్చిన సాహో పరిస్థితి కూడా అంతే. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి మాసివ్ కాంబినేషన్లో వచ్చిన సలార్ మూవీ రెండు మూడు సార్లు వాయిదా పడి పైనల్ గా థియేటర్లలో సందడి చేసింది. సలార్ సినిమాతో పాటు కల్కి కూడా పోస్ట్ పోన్ అయింది. అనుకున్న టైం కాకుండా…మరో డేట్ తో సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఇలా వరసగా ప్రభాస్ సినిమాలన్నీ వాయిదా పడుతూనే వచ్చాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా పోస్ట్ పోన్ అయ్యేసరికి ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.