చలికాలంలో తాజా కూరగాయలు, పండ్లు పుష్కలంగా లభిస్తాయి. వాటిలో బఠానీలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పచ్చి బఠానీలు చలికాలంలో సీజనల్ కూరగాయలుగా మార్కెట్‌లో లభ్యమవుతాయి. బఠానీలు రుచితో పాటు ఎన్నో పోషకాలు కలిగి ఉండడం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. వాటిని వివిధ వంటకాల్లో ఉపయోగించి ఆహారానికి రుచిని, ఆరోగ్యాన్ని అందించవచ్చు.
బఠానీల పోషక విలువలు బఠానీలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా కలిగి ఉంటాయి. విటమిన్ C, K, B6, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, ఫైబర్. వంటల్లో ఉపయోగం బఠానీలను పులావ్, బిర్యానీ, సూప్‌లు, సలాడ్‌లు, స్నాక్స్, పరాటాలు, సమోసాల్లో ఉపయోగిస్తారు.
బఠానీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- జీర్ణక్రియకు సహాయపడుతాయి బఠానీలలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- బరువు తగ్గడానికి సహకరిస్తాయి బఠానీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.పొట్ట నిండుగా ఉండేలా చేసి, భోజనాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
- గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి బఠానీలలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.
- రోగనిరోధక శక్తి పెంచుతాయి
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల బలానికి బఠానీల ప్రాముఖ్యత బఠానీలలో కాల్షియం, విటమిన్ K, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఎముకలను బలంగా చేయడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో ఎముకల బలహీనతను నివారించడంలో మేలు చేస్తాయి. కంటి ఆరోగ్యానికి బఠానీలు బఠానీలలో లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వృద్ధాప్యంతో కలిగే కంటి సమస్యలను తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో బఠానీలు కీలక పాత్ర పోషిస్తాయి.చర్మ ఆరోగ్యానికి బఠానీలు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.బఠానీలను తొక్క తీసి ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే నెల రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. చలికాలంలో వీటిని ఆహారంలో చేరుస్తే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.చలికాలంలో బఠానీలు మీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. వాటి వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడమే కాక, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.