డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అసలు టైమ్ కలిసి రావడం లేదు , ప్రస్తుతం పూరీ కి హిట్ చాలా అవసరం . ప్రేక్షకులు పూరీ జగన్నాధ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. ఇక డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి వచ్చిన టాక్ చూసి పూరీ చాలా డిస్టర్బ్ అయ్యాడు , ఈ సినిమా తరువాత పూరీ తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు .. ఇక పూరీ కూడా నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్నాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చేసింది .. ఇక పూరీ ఈసారి చేయబోయే నెక్స్ట్ సినిమాతో స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు ..
ఇక ఫామ్ లో లేని డైరెక్టర్ కు ఏ స్టార్ హీరో అవకాశం ఇస్తాడు .. పూరీ కి స్టార్ హీరో తో పని లేదు తాను రాసుకున్న కధకు ఎవ్వరు ఒకే చెప్పినా వెంటనే ఆ హీరోతో సినిమా మొదలు పెడతాడు పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది ..
గోపీచంద్‌తో పూరి కొత్త ప్రాజెక్ట్
ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది ..
గోపీచంద్ కూడా ఇటీవల సరైన విజయాలు అందుకోలేకపోయారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వమ్’ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ పరిస్థితుల్లో పూరి జగన్నాథ్‌తో జట్టుకట్టడం గోపీచంద్ కెరీర్‌కు కీలకంగా మారింది. పూరి మార్క్ కథనంలో గోపీచంద్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు కలిస్తే ఈ సినిమా ఇద్దరికీ టర్నింగ్ పాయింట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కాంబో పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు మరి కొద్దీ రోజుల్లో అఫీషియల్ ఎనౌన్స్ చేస్తారు మేకర్స్