వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాల తరువాత అనిల్ రావిపూడి మళ్ళీ వెంకేటేష్ తో ముచ్చటగా మూడవ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు .. ఇక ఈ సినిమాకి సంబంధించి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల దగ్గర నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది , అలానే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉంటుందని సోషల్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది ఈ గెస్ట్ రోల్ లో యంగ్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది .. ఇక ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఒక హిలేరియస్ కామెడీ సీక్వెన్స్ సాగుతుందని తెలుస్తోంది.
ముక్కోణపు క్రైమ్ స్టోరీలో వెంకటేష్ హైలైట్
ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముక్కోణపు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం.
ఇతర ప్రధాన పాత్రలు
ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.