అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి, కథానాయకుడు సహా ఇతర ప్రధాన పాత్రధారుల కోసం వర్క్‌షాప్ నిర్వహించేందుకు జక్కన్న టీమ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొద్ది సమయం మాత్రమే ఉంది

సైలెంట్ గా ఎస్ఎస్ఎంబీ 29 కి సంబంధించి పనులను కంప్లీట్ చేస్తున్న జక్కన్న

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి అధికారిక సమాచారం ఏమీ లేకపోయినా, దీనిపై ఏదో ఒక వార్త ప్రతిరోజూ ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. సెట్స్ మీదకు వెళ్ళకముందే అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా చర్చకు దారితీస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందన్నది అందరికీ ఆసక్తిగా మారింది.

మహేష్, జక్కన్న ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
‘గుంటూరు కారం’ సినిమా విడుదల తరువాత మహేష్ చిన్న బ్రేక్ తీసుకుని, వెంటనే తన నెక్ట్స్ మూవీ వర్క్ మొదలుపెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ సినిమాను ప్లాన్ చేసిన సూపర్ స్టార్, ఆ సినిమా కోసం తన లుక్‌లో మార్పులు చేసుకునే పనిలో ఉన్నారు.

ఎస్ఎస్ఎంబీ 29: ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29గా పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. రాజమౌళి టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఇటీవలే లొకేషన్‌ను కూడా ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి ప్రీ విజువలైజేషన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

లీడ్ ఆర్టిస్ట్‌లతో వర్క్‌షాప్ ప్లాన్
ఇది ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి, కథానాయకుడు సహా ఇతర ప్రధాన పాత్రధారుల కోసం వర్క్‌షాప్ నిర్వహించేందుకు జక్కన్న టీమ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొద్ది సమయం మాత్రమే ఉంది.

తాజా వార్తలు