పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది రష్మిక మందన్న ..ఇక బాలీవుడ్ లో చేసిన యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ..ప్రస్తుతం పుష్ప 2 సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక , పుష్ప 2 తో పాటు నెక్స్ట్ లైన్ అప్ లో ఉన్న సినిమాల విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ప్రస్తుతం రష్మిక చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తోంది .. అలానే రష్మిక తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెమిలియజేసింది .. ఇక ఈ చిత్రం నుండి రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్…… ఇప్పుడు ఈ టీజర్ కు 20 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ‘గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ బాగా దూసుకెళ్తుందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ..