పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలయ్యింది. విడుదలైన ఐదు రోజులలోనే పుష్ప 2 చిత్రం రూ. 1000 కోట్లకు చేరువైంది, ఇక మొదటి రోజు 294 కోట్లతో భారీ ప్రారంభం చేసిన ఈ సినిమా, ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు, దర్శకులు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా, విక్టరీ వెంకటేష్ కూడా పుష్ప 2 చిత్రాన్ని చూశారు మరియు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
విక్టరీ వెంకటేష్ అభినందనలు
విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ, “అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్ర బృందానికి నా అభినందనలు,” అని సోషల్ మీడియా లో తన అభిపార్యాయాన్ని తెలియజేసారు .. విక్టరీ వెంకటేష్ పుష్ప 2 ట్రేడ్ మార్క్ డైలాగ్ “అస్సలు తగ్గేదేలే” అంటూ చివర్లో క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.