నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే. అఖండ సినిమాతో ఈ కాంబో మళ్లీ ఒక సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు, అదే కాంబో మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
అఖండ 2: తాండవం మూవీని రామ్ ఆచంట, గోపీ ఆచంట, మరియు 14 రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమ్ తేజస్విని నందమూరి సమర్పణలో రూపొందుతోంది. మొన్నామధ్య ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది, మరియు తాజాగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
అఖండ 2: తాండవం – పుట్టించిన అంచనాలు
‘అఖండ 2: తాండవం’ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు, మరియు ఈ చిత్రంలో బాలకృష్ణ తన అఖండ పాత్రలో తిరిగి కనిపించనున్నారు. ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశం తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా, బాలకృష్ణ అభిమానులకు ఒక సెన్సేషనల్ హైప్ క్రియేట్ చేసింది.
అఖండ 2: తాండవం – పవర్‌ఫుల్ డైలాగ్
ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఇందులో బాలకృష్ణ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ “ఈ నేల అసురుడిది కాదు రా… ఈశ్వరుడిది… పరమేశ్వరుడిది… కాదని తాకితే జరిగేది తాండవం… అఖండ తాండవం…” అతను ఈ డైలాగ్‌తో ఓ కొత్త లెవెల్‌ను సెట్ చేశాడు. ఈ వీడియోతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు కూడా తెలియజేసారు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు, ‘అఖండ 2: తాండవం’ చిత్రం 2025 సెప్టెంబర్ 25 న దసరా పండగ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.