పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటిక్స్ లో బిజీ అయ్యాకా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు .. కానీ పవన్ కంప్లీట్ చెయ్యాలిసిన సినిమాలు అలానే పెండింగ్ లో ఉండిపోయాయి .. తాజగా పవన్ మేకప్ వేసుకొని షూటింగ్స్ లో పాల్గొంటున్నారు ..ఇటీవల “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు ,అలానే ఇప్పుడు “OG” చిత్రంలో కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్రారంభమైంది, దీనిని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
నిజానికి, 2023లోనే “OG” సినిమా షూటింగ్‌ 70% పూర్తయ్యింది. అప్పుడు పవన్ కళ్యాణ్ మరొక 2 వారాల డేట్స్ ఇవ్వగలిగితే, ఈ చిత్రం అప్పటికే కంప్లీట్ అయ్యేది ,, కానీ, అప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు. ఎన్నికలు, గెలుపు, ఉప ముఖ్యమంత్రి పదవీ వంటి పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన కారణంగా “OG” సినిమా వాయిదా పడింది.

ప్రస్తుతం, “OG” తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లో కూడా జరుగుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే టీం అక్కడ ల్యాండవ్వడమే కాదు, పవన్ లేని సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా, “హరిహర వీరమల్లు” సినిమాను కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, 2025లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.