పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజెర్ .. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి . అయితే ఈ సినిమా అభిమానులను కొంత వరకు నిరాశపరుస్తోంది, ఇందుకు గల కారణం లేట్‌గా స్టార్ట్ అయిన ప్రమోషన్‌లకు మరోసారి గ్యాప్ రావడమే.. సినిమా రిలీజ్‌కు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ట్రైలర్ గానీ, ఇతర పాటల పై గానీ ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు .. అయితే తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” ట్రైలర్‌ను డిసెంబర్ చివరి నాటికి విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అలాగే పెద్ద సినిమాలకు లేటెస్ట్ ట్రెండ్
ఇతర బిగ్ స్టార్స్ సినిమాల ట్రైలర్‌లు సాధారణంగా సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందుగానీ లేదా 15 రోజుల ముందుగానీ విడుదల చేయడం చూస్తున్నాం. అప్పట్లో కూడా, రెండవ ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తారు. కానీ “గేమ్ ఛేంజర్” విషయంలో మాత్రం ట్రైలర్ ఆలస్యంగా విడుదల చేయడం, అభిమానులను కొంత అసంతృప్తికి గురి చేస్తోంది.
ఫ్యాన్స్ ఆసక్తి
ట్రైలర్ ఆలస్యమైనా, ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఓ విజయం సాధిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.