‘‘నా జీవితం ఎక్కువగా చదువు, ఆటలతోనే గడిచింది. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతో పెరిగాను. నాన్న ఆర్మీ సోల్జర్ కావడంతో ఇల్లంతా ఆర్మీ వాతావరణమే ఉండేది,’’ అంటూ తన జీవితంలోని ఆసక్తికర అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది మిస్ ఇండియా, నటి మీనాక్షి చౌదరి.
క్రీడల పట్ల ఆసక్తి
మీనాక్షి తన చిన్ననాటి అనుభవాలను వివరిస్తూ, ‘‘నాన్న ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టేవారు. అందుకే నన్ను స్పోర్ట్స్ వైపు మలిచారు. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లో నేను స్టేట్ లెవల్ ప్లేయర్‌ని. ఈ క్రీడల వల్ల నా ఫిజిక్ ఫిట్‌గా ఉండటమే కాకుండా, నాలో స్ఫూర్తిని కలిగించాయి’’ అని చెప్పారు.
మిస్ ఇండియా నుంచి హీరోయిన్‌గా
‘‘నాన్న ద్వారా వచ్చిన ప్రపంచజ్ఞానం నాకు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడానికి దోహదపడింది. హీరోయిన్ అవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది మా నాన్న ఆశీర్వాదంతోనే సాధ్యమైంది’’ అంటూ మీనాక్షి ఆనందం వ్యక్తం చేసింది.