సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడటం ఎంత ముఖ్యమో దర్శకుల తలల మీద ఉండే ప్రెజర్ చెబుతుంది. “ఏం చేసినా హిట్ కొట్టు చాలు” అనేది నేటి పరిస్థితి. ప్రతి కొత్త ప్రాజెక్ట్ వారికి అగ్ని పరీక్షే. అందుకే కొందరు తమకు సొంతమైన స్టైల్‌ను మార్చుకోగా, మరికొందరు హిట్ కోసం సీక్వెల్స్‌ను వెతుకుతుంటారు. ఇంకొందరు క్రియేటివిటీని మించి యూనివర్స్‌లు సృష్టిస్తుంటారు. ఈ విషయాలపైనే ఇవాళ స్పెషల్ స్టోరీ ..

మారుతున్న దారులు
దర్శకుడు వివేక్ ఆత్రేయ తీసిన అంటే సుందరానికి వంటి క్లాస్ మూవీస్ తర్వాత ఒక ఫ్లాప్ ఎదుర్కొన్నారు. దీంతో ఆయన మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సరిపోదా శనివారం చిత్రాన్ని రూపొందించారు, ఇది మంచి హిట్ సాధించింది. అదే విధంగా, క్లాస్ చిత్రాలకు పేరున్న శేఖర్ కమ్ముల తనదికాని దారిని ఎంచుకుని కుబేరా చిత్రంతో వస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే ఇది కమ్ముల సినిమా కాదేమో అన్న అనుమానం కలుగుతుంది. కానీ కొత్తగా ప్రయత్నించడం కోసం ఆయన ఈ మార్పు చేశారు.

కొత్త మలుపు
కొరటాల శివ కూడా తన గత సినిమా ఆచార్య తర్వాత చాలా మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు దేవరతో ఆయన పూర్తిగా కొత్త తరహా మేకింగ్ చూపిస్తున్నారు. అలాగే, కార్తికేయ 2తో పాన్-ఇండియన్ డైరెక్టర్‌గా మారిన చందూ మొండేటి, ఇప్పుడు తండేల్ అనే భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది.

యూనివర్స్ ట్రెండ్
హనుమాన్ యూనివర్స్ సృష్టించిన ప్రశాంత్ వర్మ, అధీర, జై హనుమాన్, మహాకాళి సినిమాలతో తన విస్తృత ప్రపంచాన్ని పెంచుతున్నారు. ఈ యూనివర్స్ ట్రెండ్‌తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇండస్ట్రీలో నిలవడం కోసం దర్శకులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. క్లాస్ సినిమాల నుంచి మాస్ సినిమాలు, యూనివర్స్‌ల వరకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. హిట్ కోసం తీసుకునే ఈ ప్రయత్నాలు వారికి కొత్త గమ్యాలను అందిస్తాయి. “హిట్టు ముఖ్యం బిగిలూ” అనే ఆలోచనతో దర్శకులు తమను తాము అప్‌డేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.