నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్‌ .. భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ , హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయ్ .. తాజగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .ఇక ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది ..
యూఎస్‌ఏలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది .ఇక దీనిపై అధికారిక ప్రకటన జారీ చేశారు మేకర్స్‌. టెక్సాస్‌లోని డల్లాస్‌లో 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది.Texas Trust CU Theatre ఈవెంట్‌కు వేదిక కానుంది. మాస్‌ పేలుడును వీక్షించుకునే మిమ్మల్ని మీరు సన్నద్దం చేసుకోండి.. అంటూ వార్తను అందరితో షేర్ చేసుకుంది బాలకృష్ణ టీం.

ఈ మూవీలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యాజైశ్వాల్‌, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.