కంగువా.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి ప్రేక్షకులను డిస్సపాయింట్ చేసింది .. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. ,ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిసాస్టర్ టాక్ అందుకుంది , అయితే ఈ చిత్రం మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసి, ఈ రోజు నుంచి సినిమాను అందుబాటులో ఉంచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వెర్షన్ థియేటర్ వెర్షన్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది ..ఇక థియేటర్స్ చూడని కొన్ని సీన్స్, పాటలను కూడా కట్ చేసి ఓటీటీలోకి విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ లో, అలాగే రెండో పార్ట్ లో కూడా కొన్ని సీన్స్ కట్ చేసినట్లు తేకూస్తోంది . ముఖ్యంగా, ఫస్ట్ ఆఫ్ లో సూర్య, దిశా పటాని మధ్య ఉన్న సాంగ్ ను కూడా కట్ చేసినట్లు టాక్ . మొత్తం మీద, ఈ చిత్రం 12 నిమిషాల మేర కట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మాణం వహించాయి.