ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల . అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. పుష్ప 2 చిత్రంలో “కిస్సిక్” అనే స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించింది .. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించగా, శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ పాట విడుదలైన మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో భారీ విజయాన్ని సాధించి, 621 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా, బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో శ్రీలీల సందడి చేసింది. ఈ షోలో ఆమెతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా పాల్గొనడం విశేషం.

ఈ షోలో, శ్రీలీల తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వీణ వాయించింది, అది చూసి బాలయ్య ఫిదా అయ్యారు. ఆమెకి గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చిన బాలయ్య, నవీన్ పోలిశెట్టి ని అడిగారు, “జోగిపేట శ్రీకాంత్ కు రియల్ లైఫ్ లో చిట్టి దొరికిందా?” అని. దీనికి నవీన్ షాకయ్యారు.

అంతేకాకుండా, బాలయ్య మాట్లాడుతూ, “శ్రద్ధా కపూర్ లాగా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి, రష్మిక మందన్నా లాగా మంచి స్మైల్ ఉండాలి, అనుష్క లాగా లక్కీ ఉండాలి” అని ప్రశంసించారు. నవీన్ పోలిశెట్టి వెంటనే స్పందిస్తూ, “ఇవన్నీ ఉండాలంటే శ్రీలీల లాగా ఉండాలి” అని చెప్పి, అందరినీ నవ్వించారు.

ఇక, బాలయ్య శ్రీలీలను అడిగారు, “ఓ స్టార్ హీరోతో డేట్ కు వెళ్లాలంటే ఎవరితో వెళ్తావ్?” అని. దీన్ని పటించుకుని శ్రీలీల మిస్టర్ నవీన్ అంటూ జవాబు ఇచ్చింది. ఇది చూసి నవీన్ షాకయ్యాడు. ఫైనల్ గా అన్ స్టాపబుల్ టాక్ షోలో శ్రీ లీల యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సందడి చేసిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది