రాజస్థాన్‌లోని జైపూర్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలు

సూపర్ స్టార్ రజనీకాంత్ – యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ మూవీ కూలి .. భారీ బడ్జెట్ ,బిగ్ కాస్టింగ్ హై టెక్నీకల్ వలుఎస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు , ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు .. ఇక కూలి సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. అలానే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ బయటకు వచ్చిన సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది .. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కింగ్ నాగార్జున , ఉపేంద్ర వంటి బిగ్ స్టార్స్ ఉండడంతో ఈ సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి .., తాజాగా ఈ సినిమాకు సంబంధించి ,మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది ……ప్రస్తుతం కూలి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ..ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించబోతున్నాడు అనే సంగతి అందరికి తెలిసిన విషయమే .. ఇక తాజా షెడ్యూల్‌లో అమీర్‌ ఖాన్‌ మరియు రజినీకాంత్‌ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. షూటింగ్‌ ఈ నెలాఖరు వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. కూలీ సినిమా గోల్డ్ అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ లో తెరెకెక్కుతుంది ..ఇందులో రజినీకాంత్‌ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్లు ఇన్‌సైడ్ టాక్‌ ఉంది. ఈ చిత్రంలో సత్యరాజ్‌, మహేంద్రన్‌, అక్కినేని నాగార్జున, సౌబిన్ షాహిర్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. కూలీ టైటిల్‌ టీజర్‌లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్‌ ఛైన్లతో రజినీకాంత్ చేసిన స్టైలిష్ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతున్నాయి.