కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ నటనలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అతని ఫిల్మోగ్రఫీలో నిలిచిపోయిన చిత్రాల్లో “రఘువరన్ బీటెక్” కూడా ఒకటి. తమిళ్‌లో భారీ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సాధించి, యువతను గట్టిగా ప్రభావితం చేసింది. విడుదలైనప్పుడు ఈ సినిమా ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని, మరుపురాని అనుభూతిని కలిగించింది.

తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేక రీ-రిలీజ్
తాజాగా శ్రీస్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని 2025 జనవరి 4న మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది తెలుగు అభిమానులకు ఓ మంచి వార్తగా చెప్పుకోవచ్చు. తొలిసారి థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడడాన్ని మిస్ అయిన వారు ఈ అవకాశం ను ఉపయోగించుకోవచ్చు.

కల్ట్ హిట్: యూత్ ఫేవరెట్

“రఘువరన్ బీటెక్”లో ధనుష్ నటన, అమలాపాల్ గ్లామర్, అనిరుద్ రవిచందర్ బాణీలు ప్రేక్షకులను అలరించాయి . ఈ కథ ఓ సాధారణ యువకుడి జీవిత పోరాటాలను ప్రేరణాత్మకంగా చూపిస్తూనే, అతని ప్రేమ, కష్టాలను అద్భుతంగా మిళితం చేస్తుంది. ఈ రీ-రిలీజ్ వెర్షన్ ధనుష్ అభిమానులు, తెలుగు ఆడియెన్స్‌కు పండుగలాంటి అనుభూతిని ఇవ్వడం ఖాయం ..